లక్కీ మ్యాన్ అంటే ఇతడే... 18 సార్లు లాటరీ గెలిచాడు!
- ఇటీవల 10,00,000 డాలర్లు గెలుచుకున్న రాబర్ట్ బెవాన్
- తనకు డబ్బు కంటే తన భార్య అసలైన జాక్ పాట్ అని వెల్లడి
- 40 ఏళ్ళుగా కష్టసుఖాల్లో తన వెంట నిలిచిందన్న రాబర్ట్ బెవాన్
అమెరికాకు చెందిన రాబర్ట్ బెవాన్ 18 సార్లు లాటరీ గెలుచుకుని రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఒకసారి లాటరీ తగలితేనే ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తాం. కానీ రాబర్ట్‌కు ఏకంగా పద్దెనిమిదిసార్లు తగిలింది. అయితే తనకు డబ్బు కంటే తన భార్య అసలైన జాక్‌పాట్ అని పేర్కొన్నారు. ఇడాహో లాటరీ నిర్వహించిన 10,00,000 డాలర్ల కింగ్ స్క్రాచ్ గేమ్ లాటరీని అతడు ఇటీవల గెలుచుకున్నాడు.
రాబర్ట్ బెవాన్ ఇన్నిసార్లు లాటరీని గెలుచుకోవడం పట్ల ఇడాహో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఆయన గురించి పేర్కొంటూ, 18 సార్లు లాటరీని గెలుచుకోవడం సాధ్యమా, కానీ రాబర్ట్ బెవాన్ విషయంలో అది నిజమైందని పేర్కొంది. అతను 1997లో ఇడాహో లాటరీ వారి 'బ్లేజర్ బక్స్' ప్రమోషన్ ద్వారా మొదటిసారి ఒక లగ్జరీ 'షివర్లే బ్లేజర్' కారును గెలుచుకున్నాడు. నాటి నుంచి వివిధ రకాల లాటరీల్లో వెయ్యి నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఎన్నో గెలుచుకున్నాడు.
తన పద్దెనిమిదో లాటరీ డబ్బులను తీసుకోవడానికి ఇటీవల రాబర్ట్ బెవాన్ లాటరీ కార్యాలయానికి వచ్చాడు. ఈ సందర్భంగా అధికారులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంది.
మీ వరుస విజయాల రహస్యం ఏమిటని వారు అడిగారు.
దానికి రాబర్ట్ బెవాన్ స్పందిస్తూ, తన నిజమైన అదృష్టం ఈ లాటరీ డబ్బులు కాదని తెలిపాడు. 40 ఏళ్లుగా తన ప్రతి కష్టంలో, సుఖంలో తోడుగా నిలిచిన తన భార్య నా అసలైన జాక్‌పాట్ అని పేర్కొన్నాడు. సరదా కోసం లాటరీ కొనడం తమ జీవితంలో అలవాటుగా మారిందని చెప్పాడు. లాటరీని తాము చిన్న కాలక్షేపంగా, వినోదంగా చూసినట్లు తెలిపాడు. గెలిచిన డబ్బు జీవితంలో ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, అదే జీవిత పరమార్థం కాదని అన్నాడు. తాను కొనుగోలు చేసిన లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని, ఇది తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని అన్నాడు.